![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.....అంజలిని సారీలో చూసి మనీష్ షాక్ అవుతాడు. నువ్వేం అనుకోనంటే నేనొక మాట చెప్తాను. నువ్వు ఈ సారీలో చాలా బాగున్నావని మనీష్ చెప్పగానే థాంక్స్ అని అంజలి అంటుంది .నేను ఒక మాట చెప్తాను.. ఇన్ని రోజులు మీతో ఉన్న గొడవతో నిన్ను అని పిలుస్తున్నాను. ఏం అనుకోవట్లేదు కదా అని అంజలి అనగానే లేదని మనీష్ చెప్తాడు. చాలా సేపటి నుంచి వెతుకుతున్న నువ్వు అక్కడ సెలెబ్రేషన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మా అత్తయ్య చూస్తుంది ప్రాబ్లమ్ అవుతుందని మనీష్ చెప్తాడు.
నాకు ఆ విషయం తెలుసు.. మీరేం కంగారు పడకండి.. నేను అటువైపు వెళ్ళనని అంజలి అనగానే మనీష్ రిలాక్స్ అవుతాడు. మరొకవైపు గీతంజలి, భానుచందర్ పెళ్లి రోజు వేడుకలు మొదలవుతాయి. శంకర్ తన చెల్లి గురించి గొప్పగా చెప్తాడు. ఇప్పుడు నా గీతూ కోసం నేను మంచి కవిత చెప్తానని భాను మొదలుపెట్టగానే అందరు భయపడుతారు. మరొకవైపు అంజలి ఒకవైపు వంటలు చేస్తూ పెళ్లి రోజు వేడుకలు చూస్తుంది. వాళ్లకోసం స్పెషల్ గా సూప్ రెడీ చేసి పంపిస్తుంది. అది గీత, భాను తాగి సూపర్ ఉందని మెచ్చుకుంటారు. ఎవరు చేశారు మొన్న కాఫీ ఇచ్చిన అమ్మాయేనా.. ఆ రోజు మిస్ అయ్యాను ఈ రోజు చూడాల్సిందేనని భాను అంటాడు. వద్దు మావయ్య అని మనీష్ ఆపుతాడు.
మీరు ఎందుకు వెళ్లడమని మనీష్ అంటున్నా భాను వినకుండా అంజలి దగ్గరికి వెళ్తాడు. గీతని అటు వెళ్లకుండా వేరొకవైపుకి తీసుకొని వెళ్తారు. అంజలి దగ్గరికి భాను వెళ్లి తనని పిలుస్తాడు. తరువాయి భాగంలో గీతంజలి మొదటి కూతురు బతికే ఉందని రత్నంకి రాజారావు చెప్తాడు. అది విని రత్నం ఎక్కువ సంతోషంతో కింద పడిపోతుంది. అమ్మని చూసుకునే అమ్మాయి ఎక్కడ అని గీతాంజలి అనగానే అప్పుడే అంజలి వచ్చి రత్నంకి సేవ చేస్తుంది. అంజలిని చూసి గీత షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |